సిద్ధముగా ఉన్న దేవుడు!

కీర్తనలు 86:5

ఈ వచనము లో దేవుని గురించి ఇలా వ్రాయబడినది. ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్న మనస్సుగలవాడు. ఆయన మనలను ఎంతో అధికముగా ప్రేమించుచున్నారు కాబట్టి ఆయన మనల్ని క్షమిస్తాను అంటున్నారు. యోహాను సువార్త 3:16, 17 లో చెప్పినట్లు ఆయన మనకోసం తన అద్వితీయకుమారుని ఈ లోకమునకు పంపించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు యేసు క్రీస్తును పంపెను. యేసు క్రీస్తు సిలువపై మరణించడం ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగినది. ఆ క్షమాపణను మనము పొందుకోవాలంటే మనము చేయవలసిన పని ఒకటుంది. అది మన పాపములను ఒప్పుకుని దేవుని ముందు పశ్చాత్తాప్పడటం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును (1 యోహాను 1:9). ఈ కీర్తన(86) మొదటి వచనము లో దావీదు తన గురించి దేవుని ముందు ఒప్పుకుంటున్నాడు. మన పాపములను ఒప్పుకుంటే దేవుడు మనకి ఆ పాపమును అధిగమించు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుని ముందు ఒప్పుకోని పాపములు ఏమైనా మనలో ఉన్నాయా? మనము ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు రక్షణ దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు.