మర్మము!

ఎఫెసీయులకు 3:5

ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపోస్తులులకును, ప్రవక్తలకును బయలుపరచియున్నట్లుగా పూర్వ కాలమందు మనుష్యులకు తెలియపరచబడలేదు.

ఈ మర్మమేమిటో ఆరవ వచనంలో ఇవ్వబడినది. అన్యజనులు సువార్త విని వారి పాపములకు పశ్చాత్తాప్పడి, యేసు క్రీస్తును ప్రభువు మరియు రక్షకునిగా వారు స్వీకరిస్తే వారు కూడా అందరి క్రైస్తవులతో సమానమే. దేవుని వాగ్దానములలో వారు కూడా భాగస్వాములౌతారు. దేవుని రాజ్యములోనికి రావడానికి ఎటువంటి విధ్యార్హత, నేర్పు, తెలివితేటలు అవసరం లేదు. పశ్చాత్తాప్పడి, మన పాపములను ఒప్పుకుంటే మనము కూడా శరీరములో ఒక అవయవం వాలే యూదులతో పాటు సమానులమౌతాం. ఎందుకంటే యేసు క్రీస్తు శిరస్సయియున్నాడు, మనము ఆ శారీరము యొక్క అవయములైయున్నాము. ఈ మర్మము, ఆత్మమూలముగా దేవునితో నడుస్తున్న వారికి బయలుపరచబడుతుంది. మనము ఆత్మమూలముగా నడుస్తున్నామా? ఆత్మమూలముగా మనము, మన రక్షణను నమ్మక, అవిశ్వాసులమై దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉంది. సౌలు రాజు జీవితంలో ఇదే జరిగింది. మనము దేవుని ఆత్మమూలముగా నడుచుకుంటే దేవుని కుమారులుగా ఉంటాము.