దేవుడు చూస్తున్నాడు!

కీర్తనలు 53:2

వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

దేవుడు ఆకాశమునుండి ఆయనను వెదకు వారి కోసం చూస్తున్నాడు. వివేకము కలిగియున్న వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే వివేకము కలిగినా వారు దేవుని ప్రణాళికలను అర్థం చేసుకుంటారు. అవి వారికి నచ్చకపోయినా వారు దేవుడు చెప్పిన మాట జవదాటరు. పాత నిబంధన గ్రంధములో చూస్తే యెషయ, యిర్మియా. డానియెలు ఇలా చాలామంది వివేకము కలిగి దేవుని వెదకిన వారే. యెషయా 6:8 (Isaiah 6:8) లో నేను ఎవరిని పంపెదను? అని దేవుడు అడిగితే, నన్ను పంపు అని యెషయా అన్నాడు. అటువంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. మనము కూడా ఆ విధంగా దేవుని వెదకుతున్నామా? దేవుడు మనుష్యుల రహస్యములను విమర్శించును అని రోమా 2:16 (Romans 2:16) లో ఉంది. ఆయన ఆకాశమునుండి చూచునపుడు మన హృదయములలో, మరియు మనస్సులో ఏముందో ఆయనకు తెలుసు. మనము విశ్వాసమూలముగా నడవకపోతే మన హృదయములు కలుషితమవుతాయి. అప్పుడు దేవుడు మనలను చూడలేడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? అని లూకా 18:8(Luke 18:9) చెబుతుంది. యేసు క్రీస్తు ప్రభువు తిరిగి ఈ భూమి మీదకు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు మనము విశ్వాసముతో నడుచుకొంటూ దేవుని వెదకు వారిగా ఉంటామో! లేక లోకమునకు బానిసలై, పాపములో మునిగి అవిశ్వాసులుగా ఉంటామో ఆలోచించుకోవాలి. ఈ రోజు దేవుడు మనకు మరియొక అవకాశం ఇస్తున్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో!(యెషయా 38:1, Isaiah 38:1) అని దేవుడు అంటున్నారు.

— దేవుడు మనల్ని చూస్తున్నాడు.